Telangana Election: డీప్ ఫేక్ టెన్షన్ ఇన్ లీడర్స్.. ఎన్నికల వేల ఇదేం గోల అంటున్న నాయకులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు డీప్ ఫేక్ వీడియోల టెన్షన్ పట్టుకుంది. ప్రత్యర్థి పార్టీలు డీప్ ఫేక్ వీడియోలతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పార్టీల్లో భయం పట్టుకుందట. డీప్ ఫేక్ వీడియోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హల్ చల్ చేయబోతున్నయా? వాటితో ఓటర్లపై ఎంత మేర ప్రభావం పడుతుందన్నదీ ఇప్పుడ హాట్ టాపిక్‌గా మారింది.

Telangana Election: డీప్ ఫేక్ టెన్షన్ ఇన్ లీడర్స్.. ఎన్నికల వేల ఇదేం గోల అంటున్న నాయకులు
Deep Fake Videos

Edited By:

Updated on: Nov 26, 2023 | 4:16 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు డీప్ ఫేక్ వీడియోల టెన్షన్ పట్టుకుంది. ప్రత్యర్థి పార్టీలు డీప్ ఫేక్ వీడియోలతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పార్టీల్లో భయం పట్టుకుందట. డీప్ ఫేక్ వీడియోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హల్ చల్ చేయబోతున్నయా? వాటితో ఓటర్లపై ఎంత మేర ప్రభావం పడుతుందన్నదీ ఇప్పుడ హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎదో రకంగా దెబ్బ తీసేందుకు వ్యూహాలు….రచిస్తూ ..అమలు చేసే పనిలో ఉన్నాయట. అదే సమయంలో ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్ధుల వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టే పనిలో ఉన్నాయట. ఈ వ్యవహారానికి సోషల్ మీడియా వేదిక అవుతుందట. ఇక ప్రచారం చివరి దశలో ఉండడంతో ప్రత్యర్థి పార్టీలు ఏవిధంగా దాడి చేస్తాయి అని లెక్కలు వేసుకునే పనిలో ఉన్నాయట పొలిటికల్ పార్టీలు.

తాజాగా ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇబ్బందికరంగా మారిన డీప్ ఫేక్ వీడియోల అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలకు టెన్షన్ తెప్పిస్తోందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. డీప్ ఫేక్ వీడియోల వ్యవహారంతో ఎందో సెలబ్రేటీలు సతమతమవుతున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్ లు డీప్ ఫేక్ వీడియోల బాధితులు అయ్యారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో ప్రత్యర్థి పార్టీలు డీప్ ఫేక్ వీడియోలతో ఇబ్బంది పెడతారన్న అభిప్రాయంతో రాజకీయ పార్టీలు ఉన్నాయట. అందుకే ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను ఆయా పార్టీలు కోరుతున్నాయి. ఇటు సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లు డీప్ ఫేక్ వీడియోలతో ప్రభావితం కాకుండా చూడాలని కోరుతున్నారు.

అయితే మొత్తంగా రాజకీయ పార్టీలకు డీప్ ఫేక్ వీడియోల టెన్షన్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ రాజకీయ పార్టీలు డీప్ ఫేక్ వీడియోలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు రాబట్టుకుంటాయో చూడాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…