Telangana Election: తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అభ్యర్థి..!

అది ఆయన పార్టీ కాదు.. ఆయన ఏర్పాటు చేసిన సమావేశం కాదు. అయినా.. ఆయనకే జేజేలు, ఆయనకే జిందాబాద్‌లు. ఖమ్మం ఎస్.ఆర్. కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై, మరో మెట్టు పైకెక్కేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాకు రాజకీయ జన్మనిచ్చిన దేవుడు ఎన్టీయార్ అంటూ టీడీపీ క్యాడర్‌కి మరీ కాస్త దగ్గరయ్యారు. ఏ పరిస్థితుల్లో తాను తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చిందో చెప్పుకున్నారు.

Telangana Election: తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అభ్యర్థి..!
Thummala Nageswara Rao

Updated on: Nov 16, 2023 | 7:45 AM

అసలే ఖమ్మం, అపోజిషన్‌లో తుమ్మల.. మరి అక్కడ రాజకీయం మామూలుగా ఉండదుగా? నాలుగు దశాబ్దాల అనుభవాన్ని రంగరించిమరీ ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరెయ్యడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఇందుకోసం ఆయన గీసుకున్న స్కెచులు, వేస్తున్న ఎత్తుగడలు అన్ని పార్టీల నేతలు ఆయన వైపు చూసేలా చేస్తున్నాయి. అదిరిందయ్యా తుమ్మల అనే సౌండ్‌లు ఇస్తున్నాయి. లేటెస్ట్‌గా ఆయనెత్తిన పచ్చ జెండా.. నెక్స్ట్‌ లెవల్ అంటున్నారు తుమ్మల అండ్ కో.

అది ఆయన పార్టీ కాదు.. ఆయన ఏర్పాటు చేసిన సమావేశం కాదు. అయినా.. ఆయనకే జేజేలు, ఆయనకే జిందాబాద్‌లు. ఖమ్మం ఎస్.ఆర్. కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై, మరో మెట్టు పైకెక్కేశారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాకు రాజకీయ జన్మనిచ్చిన దేవుడు ఎన్టీయార్ అంటూ టీడీపీ క్యాడర్‌కి మరీ కాస్త దగ్గరయ్యారు. ఏ పరిస్థితుల్లో తాను తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చిందో చెప్పుకున్నారు. చిన్న వయస్సులో తనకు రాజకీయ ఓనమాలు నేర్పిందే ఎన్టీఆర్ అని, ఇరవయ్యేళ్ల పాటు వామపక్షాల్ని గెలిపించుకుంటూ తెలుగుదేశం గౌరవాన్ని నిలబెట్టిన క్రెడిట్ కూడా తనదేనని, ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పుకున్నారు తుమ్మల నాగేశ్వర రావు.

పసుపు జెండా లేకుండా తెలంగాణలో జరుగుతున్న తొలి ఎన్నికలు.. ఈసారి తెలుగు తమ్ముళ్లు ఎవరి వైపు.. అనేదే తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న ఆసక్తి. ఇదే గ్యాప్‌లో తుమ్మల నాగేశ్వర రావు వేసిన పాచిక.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. నా వెనుక ఎన్టీయార్ ఉన్నారన్న ధైర్యంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని ఇటీవలే ఓపెన్‌గా చెప్పుకున్న తుమ్మల, ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు నేరుగానే గాలం వేశారు. టీడీపీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై.. తెలుగు దేశం పార్టీ శ్రేణులతోనే సన్మానం చేయించుకున్నారు.

తుమ్మల మాటల్లో కూడా గతంలో కంటే పదును పెరిగింది. ఇవి ఖమ్మం జిల్లా రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు, అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ చెప్పుకొచ్చారు తుమ్మల. సన్నాసుల్లా బతికే జాతి కాదు, తల ఎత్తుకుని బతికే జాతి మనది… అంటూ లోకల్ సెంటిమెంట్‌ని విచ్చలవిడిగా రగలిస్తూ, అన్ని కార్నర్స్‌నీ కలుపుకుపోతున్నారు తుమ్మల. ఖమ్మంలో తనతో పాటు పాలేరులో పొంగులేటిని కూడా తెలుగు దేశం ఓట్లతో గెలిపించుకునే బాధ్యతను భుజాన వేసుకున్నారు.

ఖమ్మం హాట్ ఫేవరిట్‌ లీడర్లలో ఒకరైన తుమ్మల నాగేశ్వరరావు.. ఈసారి ఆరునూరైనా విక్టరీ కొట్టాలన్న కసితో అట్నుంచి ఇట్నుంచీ అన్ని వైపుల నుంచీ నరుక్కొస్తున్నారు. బుర్రలో ఫ్లాష్ అయిన ప్రతీ పొలిటికల్ ఐడియానూ అమల్లో పెట్టేస్తున్నారు. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని ఢీకొట్టి నిలబడ్డానికి ఈయన ఏం మాయ చేస్తాడో అని అందరూ ఎదురుచూడ్డం మొదలుపెట్టారు. అటు.. కేసీఆర్ కూడా తుమ్మలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎవరు ఎవరికి మంత్రి పదవి ఇచ్చారన్న స్టేట్‌మెంట్లతో వీళ్లిద్దరి మధ్య పెద్ద డైలాగ్ వారే నడిచింది. ఇలా తెలంగాణ రాజకీయమంతా ఖమ్మం చుట్టూ తిరిగేలా, పొలిటికల్ సర్కిల్స్ అన్నీ తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. దటీజ్‌ ది మేజిక్ ఆఫ్ తుమ్మల.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…