Telangana Govt: తెలంగాణలో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఫిజికల్ అటెండెన్స్..?

Telangana Govt: రాష్ట్ర వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించడంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Telangana Govt: తెలంగాణలో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఫిజికల్ అటెండెన్స్..?
Minister Sabitha

Updated on: Jun 21, 2021 | 5:36 PM

Telangana Govt: రాష్ట్ర వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించడంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత శాఖా అధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో జులైన 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో విధివిధానాల రూపకల్పనపై చర్చించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణ, అటెండెన్స్ తప్పనిసరి, ఉపాద్యాయులకు వ్యాక్సీన్, మౌలిక వసతుల కల్పన లాంటి కీలక అంశాల పై చర్చించారు. అలాగే 7వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఆపై స్థాయి విద్యార్థులందరికి ఫిజికల్ అటెండెన్స్, ప్రైమరీ తరగతులకు ఫిజికల్ అటెండెన్స్ వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. దీనిపై మరికొద్ది రోజుల్లో తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నవీన్ మిట్టల్, కమిషనర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సయ్యద్ ఉమర్ జలీల్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం, రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటంతో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో లాక్‌డౌన్ ఎత్తివేయడం సహా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు, కాలేజీలను తెరవాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయానుసారమే.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాఠశాల రీ ఓపెన్‌పై ప్రణాళికలు చేస్తున్నారు. అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

Also read:

CM KCR Warangal Tour : వరంగల్ జిల్లాల పేర్లలో మార్పు చేసిన సీఎం కేసీఆర్.. తెరపైకి కొత్తగా హన్మకొండ జిల్లా..?