TS ECET Results 2023: రేపే తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

తెలంగాణ ఈసెట్‌-2023 ఫలితాలు మంగళవారం (జూన్‌ 13) విడుదలకానున్నాయి. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలియజేస్తూ ఈసెట్‌ కన్వీనర్‌..

TS ECET Results 2023: రేపే తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి
TS ECET 2023

Updated on: Jun 12, 2023 | 7:04 PM

తెలంగాణ ఈసెట్‌-2023 ఫలితాలు మంగళవారం (జూన్‌ 13) విడుదలకానున్నాయి. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలియజేస్తూ ఈసెట్‌ కన్వీనర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణ ఈసెట్‌-2023 ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 20వ తేదీన జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22,000 మందికి పైగా విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌, బీఎస్‌సీ మ్యాథ్స్‌ పూర్తిచేసిన విద్యార్థులకు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.