Telangana: ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవిగో

|

Feb 24, 2023 | 1:22 PM

ఫిబ్రవరి 24న తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు విడుదల అయ్యింది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూలును విడుదల చేశారు.

Telangana: ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవిగో
Telangana Eamcet 2023
Follow us on

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది.  మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది.  ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు.  ఏప్రిల్ 12 నుండి 14వ తేదీవరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది.  250 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. 500 రూపాయల లేటు ఫీజుతో ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు.  2500 లేటు ఫీజు ఏప్రిల్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. 5000 రూపాయల లేటు ఫీజుతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఏప్రిల్‌ 30 నుండి ఆన్‌లైన్‌లో ఎంసెట్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది.

ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష పరీక్ష ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలుగా ఫిక్స్ చేశారు.

పీజీఈసెట్​ నోటిఫికేషన్​ విడుదల

ఫిబ్రవరి నెల 28న పీజీఈసెట్​ నోటిఫికేషన్​ విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఏప్రిల్​ 30 వరకు పీజీఈసెట్​కు అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. లేటు ఫీజుతో మే 24 వరకు పీజీఈసెట్​ దరఖాస్తుల ఆహ్వానిస్తారు. మే21 నుంచి పీజీఈసెట్​ హాల్​ టిక్కెట్లు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. మే 29 నుంచి జూన్​1 వరకు పీజీఈసెట్​ పరీక్షను నిర్వహించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి