TS Monsoon update: తెలంగాణలో మరో 48 గంటల పాటు తేలికపాటి వర్షాలు..

|

Jun 17, 2021 | 2:41 PM

Telangana Weather Forecast: రుతుపవణాల ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు  ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే..

TS Monsoon update: తెలంగాణలో మరో 48 గంటల పాటు తేలికపాటి వర్షాలు..
Follow us on

రుతుపవణాల ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు  ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించాయని వెల్లడించింది. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్,మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి,  ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌,  జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

గురువారం, శుక్రవారం వాతావరణం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోసారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ఇదిలా ఉండగా.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి : AP Exams: ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్..

ఏటీఎంలో దొంగలు పడ్డారు.. సీసీ కెమెరాను పగలగొట్టారు.. ఇక అంతా ఓకే అనుకుంటే..ఆ గదిలో ఓ మూల వణుకు పుట్టించింది..