Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా సైలెంట్‌గా ఉన్న కరోనా.. మళ్లీ విజృంభిస్తుంది. కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో క్రమేనా పురోగతి కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 155 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 81, రంగారెడ్డి జిల్లా పరిధిలో 42, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 11 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఇవాళ 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.51 శాతంగా ఉంటే.. రికవరీ రేటు 99.37 శాతంగా ఉంది. ఇదే సమయంలో పాజిటివ్ రేట్ 0.12 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తతుం 907 యాక్టీవ్ కేసులు ఉండగా.. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. మరికొందరు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 16,319 శాంపిల్స్ సేకరించారు. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,94,184 కి పెరిగింది. అదే సమయంలో కోలుకున్న వారు 7,89,166 మంది ఉన్నారు. ఇక మరణాల సంఖ్య 4,111 లకు చేరింది.