Telangana Corona: కరోనా ఎఫెక్ట్‌.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్కులు, ఉద్యాన వనాలు మూసివేత

Telangana Corona Effect: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. కరోనా కట్టడికి..

Telangana Corona: కరోనా ఎఫెక్ట్‌.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్కులు, ఉద్యాన వనాలు మూసివేత

Updated on: May 02, 2021 | 10:20 AM

Telangana Corona Effect: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ ప్రభావం మరోసారి పార్కులు, ఉద్యానవనాలపై పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్కులు, ఉద్యానవనాలు, జూపార్కులు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో జూ పార్కులు, పులుల అభయరణ్యాలు, జాతీయ ఉద్యానవనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్‌ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు స్పందించిన అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు, నెహ్రూ జూలాజికల్‌ పార్కులను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ లు, రక్షిత అటవీ ప్రాంతాల మూసివేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు తక్కువగా ఉన్నా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నైట్‌కర్ఫ్యూ విధిస్తోంది. అలాగే మాస్కు లేని వారికి జరిమానా విధిస్తున్నారు పోలీసులు.

ఇవీ కూడా చదవండి:

SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఆ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు

Amazing Facts: పశ్చిమబెంగాల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు.. హౌరా నుంచి ఎస్‌బీఐ వరకు అన్ని ఆశ్యర్యపరిచే అంశాలే..!

Amazing Facts: పుదుచ్చేరి గురించి ఆసక్తికరమైన విషయాలు.. ఇక్కడ ఆగస్టు 16న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు..ఎందుకో తెలుసా..?

Follow Us