Telangana Corona Cases: తెలంగాణలో భారీగా తగ్గింది.. కొత్తగా 453 కరోనా కేసుల.. యాక్టివ్ కేసులు సంఖ్య ఇలా

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో...

Telangana Corona Cases: తెలంగాణలో భారీగా తగ్గింది.. కొత్తగా 453 కరోనా కేసుల.. యాక్టివ్ కేసులు సంఖ్య ఇలా
Covid-19

Updated on: Aug 12, 2021 | 9:56 PM

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 89,675 శాంపిల్స్ టెస్ట్ చేయగా 453 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,53,289కి చేరింది. తాజాగా మరో  ముగ్గురు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 3,836కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌‌లో వెల్లడించింది.  రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.06 శాతం కాగా.. డెత్ రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 83 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:  Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు..  

Credit Card Payment: మీరు క్రెడిట్ కార్డు బిల్ పే చేసేముందు ఇలా చేస్తే బోలెడు డబ్బులు కలిసి వస్తాయి..