Kitex Garments: కైటెక్స్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి ట్వీట్.. తీవ్రంగా స్పందించిన టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్..

|

Jul 12, 2021 | 10:18 PM

Kitex Garments: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కైటెక్స్ సంస్థను కర్నాటకకు తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్..

Kitex Garments: కైటెక్స్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి ట్వీట్.. తీవ్రంగా స్పందించిన టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్..
Manickam Tagore
Follow us on

Kitex Garments: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కైటెక్స్ సంస్థను కర్నాటకకు తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణకు వచ్చిన దానిని మీరెలా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారని ప్రశ్నించారు. మీ శక్తిని ఉపయోగించి తెలంగాణకు నష్టం చేకూర్చొద్దని కేంద్ర మంత్రికి హితవు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటుందని, ఈ విషయంలో కైటెక్స్ విషయంలో మరోసారి నిరూపితం అయిందని మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్‌ను మాణిక్యం ఠాగూర్ రీట్వీట్ చేస్తూ కామెంట్ చేశారు.

కైటెక్స్ వ్యవహారంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వైఖరిపై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తీరును తప్పుపట్టారు. కైటెక్స్‌ను కర్నాటకకు ఆహ్వానించడం సరికాదన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలను కర్నాటకకు ఆహ్వానించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర రాజీవ్ చంద్రశేఖర్ వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు కేరళలో ఉన్న కైటెక్స్ సంస్థను అక్కడి నుంచి తరలించి తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఆ సంస్థ యాజమాన్యం. దీనికి సానూకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే, కైటెక్స్ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ‘కైటెక్స్‌కు చెందిన సాబు జాకబ్‌తో మాట్లాడాం. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం అన్ని వసతులు కల్పిస్తారు’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై తెలంగాణ ప్రభుత్వం సహా, రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Also read:

Viral Video: అమ్మో బొమ్మ.. సడెన్‌గా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. ఇదేం క్రియేటీవీటీ రా బాబూ..!

INDW vs ENGW: రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భారత యువ సంచలనం.. 18 ఏళ్లు నిండకుండానే నెంబర్ వన్..! ఎందులోనో తెలుసా?

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ధర్మశాలలో ఆకస్మిక వరదలు.. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు