Telangana: ఛలో నాగర్ కర్నూల్.. ఇవాళ బిజినేపల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరుకానున్న థాక్రే, రేవంత్..

|

Jan 22, 2023 | 9:57 AM

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి సిద్ధమైంది. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తోంది కాంగ్రెస్. సాయంత్రం జరిగే బహిరంగ సభకు

Telangana: ఛలో నాగర్ కర్నూల్.. ఇవాళ బిజినేపల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరుకానున్న థాక్రే, రేవంత్..
Telangana Congress
Follow us on

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి సిద్ధమైంది. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తోంది కాంగ్రెస్. సాయంత్రం జరిగే బహిరంగ సభకు తెలంగాణా కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ దళిత నాయకులపై దాడికి నిరసనగా సభ నిర్వహిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ బహిరంగ సభ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నెల 7న నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి శివారులో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి బృందం బయలుదేరింది. ఈ క్రమంలో రిజర్వాయర్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇది కాస్త చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారి తీసింది. ఇరుపార్టీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనపై ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇవాళ బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

రాజకీయ లబ్ధికోసం ఈ సభ అని ఆరోపించారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నేను ఎమ్మెల్యే అయ్యాక పొలిటికల్‌గా ఒక్క కేసు కూడా పెట్టలేదు, నీ హయంలో ఎన్ని కేసులు పెట్టావో రుజువు చేస్తా అంటూ సవాల్‌ విసిరారు మర్రి. వేదిక నన్ను డిసైడ్ చేయమంటావా? నువ్వు డిసైడ్ చేస్తావా? అభివృద్ధి, ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడమే నాగం పని అని ఆరోపించారు మర్రి జనార్ధన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..