Telangana Congress: దిగ్విజయ్‌ను కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయన రియాక్షన్ ఇదీ..

|

Dec 22, 2022 | 5:58 AM

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌.. హైదరాబాద్‌ రావడం రావడమే యాక్షన్‌లోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు టాక్స్‌ స్టార్ట్‌ చేశారు. నేతల మధ్య విభేదాలు, వివాదాలను..

Telangana Congress: దిగ్విజయ్‌ను కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయన రియాక్షన్ ఇదీ..
Komatireddy Venkat Reddy
Follow us on

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌.. హైదరాబాద్‌ రావడం రావడమే యాక్షన్‌లోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు టాక్స్‌ స్టార్ట్‌ చేశారు. నేతల మధ్య విభేదాలు, వివాదాలను క్లియర్‌ చేసేందుకు మంత్రాంగం మొదలుపెట్టారు దిగ్విజయ్‌. ఏఐసీసీ దూతను కలిసేందుకు ఆయన బస చేసిన హోటల్‌కి క్యూకట్టారు టీకాంగ్రెస్‌ లీడర్స్‌. డిగ్గీరాజాతో సమావేశమైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 20నిమిషాలపాటు చర్చించారు.

రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యాక పార్టీ పరిస్థితి ఎలా ఉందో వివరించినట్టు చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పార్టీ పుంజుకోవడానికి అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే, మళ్లీ ఢిల్లీలో కలుద్దామని దిగ్విజయ్‌ చెప్పారన్నారు కోమటిరెడ్డి. పార్టీ మారతారంటూ జరుగుతోన్న ప్రచారంపైనా క్లారిటీ ఇచ్చారు వెంకట్‌రెడ్డి. అసలా మాట తానెప్పుడన్నా అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..