Uttam: ‘ఒక్కో మహిళకు ఐదు నుంచి పది వేల రూపాయలు బాకీ.. ఏంటి ఈ స్టేషన్ పరిస్థితి’: ఉత్తమ్ కుమార్ రెడ్డి

|

Sep 05, 2021 | 2:21 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ సర్కార్ మహిళల్ని చీట్ చేస్తోందని ఆరోపించారు.

Uttam: ఒక్కో మహిళకు ఐదు నుంచి పది వేల రూపాయలు బాకీ.. ఏంటి ఈ స్టేషన్ పరిస్థితి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam
Follow us on

Telangana Women – Uttam Kumar Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ సర్కార్ మహిళల్ని చీట్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మహిళలను మోసం చేస్తోంద్ననారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో మహిళకు ఐదు నుంచి పదివేల రూపాయలు బాకీ పడిందన్నారు.

2018 ఎన్నికల్లో వడ్డీలేని రుణ పరిమితిని పది లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటివరకు అణా పైసా కూడా రిలీజ్ చేయలేదన్నారు ఉత్తమ్. మహిళా సంఘాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు 3వేల కోట్ల రూపాయలు బకాయి పడిందంటూ లెక్కలు చెప్పారు.

ఈ డబ్బును మహిళలకు ఇప్పించేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిర్యాలగూడలో రైలు ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించిన ఉత్తమ్.. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రైల్వే ఉన్నతాధికారులను కోరారు.

Read also: Ganesh Festival: ఏపీలో బీజేపీ vs వైసీపీ. గణేష్ ఫెస్టివల్ ఫైట్. ఎవరి దారెటు.. ఎవరి వెర్షన్ ఏంటి.?