T.Congress: కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి ఏం తేల్చారంటే?

|

Mar 20, 2022 | 3:14 PM

కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్‌పై ఉదయం నుంచి ఒకటే హడావుడి. ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా సమావేశమయ్యారు. కానీ అంతకుముందే హైకమాండ్ అలెర్ట్ అయింది.

T.Congress: కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.. చివరికి ఏం తేల్చారంటే?
T Congress
Follow us on

Telangana Congress Meet: ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన సీనియర్ల మీటింగ్ చివరికి కూడా ట్విస్ట్‌తోనే ముగిసింది. కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్‌(Senior Congress Leaders Meet)పై ఉదయం నుంచి ఒకటే హడావుడి. ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా సమావేశమయ్యారు. కానీ అంతకుముందే హైకమాండ్ అలెర్ట్ అయింది. సీనియర్లకు ఏఐసీసీ(AICC) కార్యదర్శి బోసురాజు ఫోన్లు చేశారు. మీటింగ్‌లు పెట్టొద్దని.. ఏమైనా సమస్యలుంటే నేరుగా సోనియా, రాహుల్‌గాంధీతో చర్చించాలని కోరారు. ఈ హెచ్చరికలతో కొంత మంది సీనియర్లు వెనక్కి తగ్గారు. 12 గంటలకల్లా మొత్తం ఐదుగురు నేతలు మాత్రమే మీటింగ్ వచ్చారు. మిగతా వారి కోసం కాసేపు వెయిట్ చేసిన నేతలు మీటింగ్ ప్రారంభించారు…

మీటింగ్ ముగిసే సమయానికి ఊహించని విధంగా అక్కడ అద్దంకి దయాకర్ ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందే గాంధీ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి సీనియర్లపై గరంగరం అయిన అద్దంకి.. ఒక్కసారిగా అశోక హోటల్‌కి వచ్చారు. కానీ సీనియర్లెవరూ ఆయనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు..ఇదిలావుంటే, తమది అసమ్మతి సమావేశం కాదని.. కేవలం పార్టీ విధేయుల సమావేశం మాత్రమేనని చెప్పారు మర్రిశశిధర్ రెడ్డి. పార్టీ బలోపేతంపై చర్చించేందుకే కలిశామన్నారు. ఇంతకుముందూ కలిశాం.. ఇకపైనా కలుస్తామని స్పష్టం చేశారు. కాగా, తామంతా సోనియా, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే, రేవంత్‌రెడ్డిపై ఓరేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. ఆయన మాణిక్కం ఠాగూర్‌తో కలిసి పార్టీకి చేస్తున్న ద్రోహన్ని బయటపెడుతానంటూ సంచలన కామెంట్స్ చేశారు. వీహెచ్ మంత్రి హరీష్‌రావుని కలవడంపైనా జగ్గారెడ్డి స్పందించారు. కూతురు ఇష్యూపై మంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.