Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. తొలగించిన నర్సులను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్..

|

Jul 10, 2021 | 3:56 PM

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల తొలగింపు,

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.. తొలగించిన నర్సులను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్..
Revanth Reddy
Follow us on

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల తొలగింపు, ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లని మీరే పొగిడారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎందుకు స్పందించడం లేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారని అన్నారు. ప్రగతి భవన్ కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా? లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా? అంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. 2018 లో ఎంపికైన ఎఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలన్నారు.

ఇదే సమయంలో ఉద్యోగాలపై భర్తీ అంశాన్ని కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. 50 వేల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన ప్రకటన చీటింగ్ “వన్స్ మోర్” లాగా ఉందందంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే.. మీరు 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్ల లోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతి త్వరలోనే నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

ఇదిలాఉండగా.. ప్రభుత్వం తొలగించిన 1640 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ స్టాప్ న‌ర్సుల‌ు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. తొలగించిన వారందరినీ తిరిగి డ్యూటీలోకి తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక‌రావాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. వీరి వినతిపత్రానికి సమర్పించిన రేవంత్ రెడ్డి.. క‌రోనా విజృంభించిన వేళ ప్రాణాల‌ను సైతం పణంగా పెట్టి క‌రోనా రోగుల‌కు 24 గంట‌ల పాటు సేవ‌లు అందించిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ న‌ర్సుల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం హేయ‌మైన చ‌ర్య అని అన్నారు. ఉద్యోగులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ వారికి అండ‌గా ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Also read:

Kitex Garments: సొంతూరు కేరళను కాదనుకుని తెలంగాణకు మొగ్గు.. వరంగల్‌లో కైటెక్స్‌ రూ. వెయ్యి కోట్ల పెట్టబడులు.

Lakshmi Manchu: మరో సరికొత్త ప్రోగ్రామ్ తో రానున్న ఆహా .. మంచు లక్ష్మి హోస్ట్ గా ‘ఆహా భోజనంబు’

Srisailam Devasthanam: శ్రీశైలం క్షేత్రంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు.. ప్రకటించిన దేవస్థానం ఈవో రామారావు..