Telangana CMO: తెలంగాణలో పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ముందుగా తన కార్యాలయం నుంచి ప్రక్షళనను ప్రారంభించారు. సీఎం పీఆర్‌వో విజయ్‌ను తొలగిస్తూ సీఎంఓ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తొలగించారు. అవినీతికి పాల్పడినా.. క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినా వేటు తప్పదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం అటు నాయకులకు, ఇటు అధికారులకు పరోక్షంగా హెచ్చరించే సంకేతాలిచ్చింది. ఇదిలాఉంటే.. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేసినట్లు విజయ్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
Also Read: