CM.Revanth Reddy: అవార్డు గ్రహీతలకు నగదు బహుమతిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

|

Feb 04, 2024 | 2:00 PM

చిరంజీవి, వెంకయ్య నాయుడుకుతో పాటు మరికొంతమంది కవులకు, కళాకారులకు అవార్డులు ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ఉండి వారి ఎంచుకున్న కళలకు జీవితాంతం సేవ చేసినందుకు వారికి పద్మ అవార్డులు రావటం..

CM.Revanth Reddy: అవార్డు గ్రహీతలకు నగదు బహుమతిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy
Follow us on

ప్రతిష్టాత్మక పద్మ అవార్డ్స్ కు ఎంపికైన వారిని తెలంగాణ సర్కార్ సత్కరించింది. చిరంజీవి, వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. చిరంజీవి, వెంకయ్య నాయుడుకుతో పాటు మరికొంతమంది కవులకు, కళాకారులకు అవార్డులు ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ఉండి వారి ఎంచుకున్న కళలకు జీవితాంతం సేవ చేసినందుకు వారికి పద్మ అవార్డులు రావటం నిజంగా ఆనందదాయకం అన్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “చిరంజీవి, వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ రావటం సముచితం. కవులకు,కళాకారులకు అవార్డు వస్తున్నాయి కానీ ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీత కు పాతిక లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటిస్తున్నాం. కళలను బ్రతికించుకోవాలంటే అందరూ రాజకీయాలకతీతంగా ముందుకు రావాలి అన్నారు రేవంత్ రెడ్డి.

వెంకయ్య నాయుడు చిరంజీవి గారి చేతుల మీదుగా పద్మశ్రీ బాటిల్ రైతులకు నగదు బహుమతి అందజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి నెల వారి ఖర్చులకోసం పెన్షన్ అందిస్తున్నాం..పాతిక వేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి పదవి కూడా దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా” అని రేవంత్ రెడ్డి అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..