గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్‌జిల్లా కేంద్రంలో పర్యటించననున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా పరిధిలోని భూత్పూర్ దారిలో ఉన్న నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే వివిధ రకాల పనుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల ఆవరణలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పాలమూరు పట్టణం కొత్త శోభ సంతరించుకుంది.
ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, 12గంటల 45 నిమిషాలకు మహబూబ్‌నగర్ చేరుకుంటారు. ముందుగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్‌నగర్‌జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటల 45 నిమిషాలకు భూత్పూర్ దారిలో కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
సాయంత్రం 4 గంటలకు స్థానిక MVS కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. పాలమూరు పట్టణం కొత్త శోభ సంతరించుకుంది. పట్టణంలోని జాతీయ రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గులాబీ తోరణాలు ఫ్లెక్సీలతో పాలమూరు పట్టణాన్ని గులాబీ మయంగా మార్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం