CM KCR: కొత్త సచివాలయం పనుల్ని పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఫిబ్రవరినాటికి పూర్తి కావాలని ఆదేశం..

|

Nov 17, 2022 | 9:06 PM

ఫిబ్రవరి టార్గెట్! ఫార్ములా ఈ ఛాంపియన్‌ షిప్ మొదలయ్యేలోపు సచివాలయం సిద్ధంగా ఉండాలి.! ఇది అధికారులకు CM కేసీఆర్ ఆదేశం..! మరి ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి? ఫార్ములా రేసింగ్‌కి సెక్రటేరియట్ పూర్తికావడానికి ఉన్న లింకేంటి?

CM KCR: కొత్త సచివాలయం పనుల్ని పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఫిబ్రవరినాటికి పూర్తి కావాలని ఆదేశం..
CM KCR
Follow us on

నూతన సచివాలయ నిర్మాణ పనుల్ని పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. పనులు తుది దశకు చేరుకున్నాయి. 90 శాతం నిర్మాణం పూర్తయింది. ఇంటీరియర్, నెట్‌వర్క్‌, లాండ్‌ స్కైప్, పార్కింగ్‌ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయం లోపల నిర్మిస్తున్న టెంపుల్‌, మసీద్‌ వర్క్స్‌ కూడా జరుగుతున్నాయి. అయితే మ్యాన్‌ పవర్‌ను మరింత పెంచి.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్ . ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం నాటికి మొత్తం నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ స్థాయి ఫార్మూలా రేస్ జరుగుతోంది. ట్రయల్‌ రన్‌ తర్వాత ఫిబ్రవరిలో అసలు రేస్‌ మొదలవుతుంది. ఈ ఈవెంట్‌కి ఇంటర్నేషనల్‌ మీడియా వస్తుంది. వరల్డ్‌వైడ్‌గా టెలికాస్ట్‌ అవుతుంది. ఆ లోగా సెక్రటేరియట్‌ను సిద్ధం చేస్తే..స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుదన్నది ప్రభుత్వం ఆలోచన.

తెలంగాణ హెడ్‌క్వార్టర్స్‌గా అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని భావిస్తోంది. ఆలోపు పనులు పూర్తిఅయ్యేలా టార్గెట్‌ పెట్టుకుంది. ఇక సచివాలయంలో వాడే ఫర్నీచర్‌ను కూడా సీఎం కేసీఆర్ సెలక్ట్‌ చేశారు. హై సెక్యూరిటీతో కూడిన నెట్‌వర్కింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సమాచారం లీక్‌ కావడం.. హ్యాకింగ్‌కి గురికావడం వంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో నిర్మిస్తున్నారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్‌ చేశారు. ఇప్పటికే కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ పేరుని ఖరారు చేశారు.

అంతకుముందు సెక్రటేరియట్‌లో పలు సమీక్షలు నిర్వహించారు సీఎం కేసీఆర్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఐదు నెలల పాటు కొనసాగింది. సమస్యలు ఉన్నవారికి కళ్లద్దాలు కూడా పంపిణీ చేసింది.

మరోసారి ఈ ప్రోగ్రామ్‌ను చేపట్టాలని ఆదేశించారు. అలాగే రోడ్లుభవనాల శాఖపైనా సమీక్షించారు. ఇటీవలి వర్షాలకు పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం చేపట్టాల్సిన పనులు, నిధులపై చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం