CM KCR Corona Positive : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోనానికి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు, అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు , ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి, కర్ణాటక సీఎం వంటి వారు కరోనా బాధితులు కాగా.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ప్రసుతం ఆయన తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని.. తెలిపారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని సోమేశ్ కుమార్ చెప్పారు. అయితే కరోనా కు సంబంధించిన మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉన్నాయని ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు.
ఇక గత 24 గంటల్లో తెలంగాణాలో కరోనా భారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,55,433 మంది కరోనా బారినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక ఆదివారం ఒక్కరోజే 1,878 మంది బాధితులు కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే, గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 14 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం ఇప్పటివరకు 1,838 మంది మరణించగా, 3,14,441 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం.. మీలో రోగనిరోధక శక్తి ఉందో లేదో తెలుసుకోండి ఇలా..
కరోనా మహమ్మారి కట్టడికి మాజీ ప్రధాని మన్మోహన్ పలు సూచనలతో ప్రధాని మోడీకి లేఖ