CM KCR-Sakini Ramachandraiah: పద్మశ్రీ రామచంద్రయ్యకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

|

Feb 02, 2022 | 10:49 AM

Sakini Ramachandraiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్య కు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెం లో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును

CM KCR-Sakini Ramachandraiah: పద్మశ్రీ రామచంద్రయ్యకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
Telangana Cm Kcr Special Reward To Padma Sri Sakini Ramachandraiah
Follow us on

Sakini Ramachandraiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్య కు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెం(Kothagudem)లో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు ను అందుకున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్(CM Kcr) ను మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగాచ రామచంద్రయ్య కలిసారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతక కళను బతికిస్తున్నందుకు సిఎం అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ను పొందడం పట్ల సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సిఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సిఎం ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, తాతా మధు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మెత్కు ఆనంద్, గణేశ్ బిగాల, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.

Also Read: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..