Ambedkar Jayanthi: భార‌త‌ర‌త్న బీఆర్ అంబేద్కర్ చిత్రప‌టానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌కు ఘన నివాళి అర్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

Ambedkar Jayanthi: భార‌త‌ర‌త్న బీఆర్ అంబేద్కర్ చిత్రప‌టానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు..
Cm Kcr

Updated on: Apr 14, 2022 | 5:34 PM

CM KCR pays tributes: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌(Dr BR Ambedkar)కు ఘన నివాళి అర్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకొని ప్రగతిభవన్ లో ఆయన చిత్రపటానికి కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ అని కొనియాడారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశర్వర్ రెడ్డి, నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు, పీఆర్వోలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Read Also…  AP Home Minister: బాధితులకు అండ ఉంటాం.. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలను మూసివేస్తాం: హోంమంత్రి వనిత