International Youth Day 2021: ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర అద్వితీయం: సీఎం కేసీఆర్

ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున

International Youth Day 2021: ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర అద్వితీయం: సీఎం కేసీఆర్
Kcr

Updated on: Aug 11, 2021 | 8:27 PM

Telangana CM KCR: ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందన్నారు కేసీఆర్.

అంతర్జాతీయ యువజన దినోత్సవం (12 ఆగస్టు) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి వంటి రంగాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణలో ఉపాధికి అవకాశమున్న టూరిజం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని సీఎం తెలిపారు. స్వయం ఉపాధి కోసం నిరుద్యోగులకు ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తున్నదన్నారు. శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమలులోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామన్నారు కేసీఆర్.

సరికొత్త, వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతున్నదన్న సీఎం, భవిష్యత్ తెలంగాణ యువతదేనన్నారు.

Read also: Kamma Community: ‘కమ్మ సామాజిక వర్గంలో పేద, మధ్య తరగతి వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా నా వంతు కృషి చేస్తా’