Telangana: పోడు రైతులకు గుడ్ న్యూస్.. భూముల సమస్యకు చెక్.. సీఎం ఆదేశాలు

|

Oct 27, 2021 | 7:49 PM

రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి గాను నవంబర్ 8 వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

Telangana: పోడు రైతులకు గుడ్ న్యూస్.. భూముల సమస్యకు చెక్.. సీఎం ఆదేశాలు
Podu Farmers
Follow us on

రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి గాను నవంబర్ 8 వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణలో అడవిపై ఆధారపడ్డ గిరిజనులకు మేలు చేయాలని కేసీఆర్ సూచించారు. అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని సీఎం అన్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపొందించే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు అటవీ, రెవిన్యూ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఆర్.శోభ, రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డి ప్రియాంకా వర్గీస్ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కమిటీలచే ఆయా గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందు పరిచే అంశాలు ఇతర అంశాలపై చైతన్య, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముందు ముందు అటవీ భూముల ఆక్రమణ ఉండదని గ్రామస్తులు అంగీకరించే విధంగా చైతన్య పర్చాలని స్పష్టం చేశారు. డివిజన్, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకాధికారులను నియమించాలని సోమేశ్ కుమార్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, ఏమాత్రం వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. అత్యధిక విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాలకు సీనియర్ అటవీ శాఖ అధికారులను నియమించాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ పీసీసిఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, ఎం.సి పరగెన్ లు కూడా పాల్గొన్నారు.

Also Read:48 వేల మందికి ఉద్యోగాలు… ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్