CM KCR-PM MODI: ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ..

|

Sep 03, 2021 | 6:07 PM

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం కొనసాగుతోంది.

CM KCR-PM MODI: ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ..
Cm Kcr Meet Pm Modi
Follow us on

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం కొనసాగుతోంది. పది అంశాలపై పీఎం మోడీకి లేఖలు అందజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. వీటిలో IPS క్యాడర్ రివ్యూ.. టెక్సటైల్ పార్క్..హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్.. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు అంశాలతోపాటు.. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధుల కేటాయింపు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచడం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలను ప్రధాని ముందుకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

లేఖలో పొందుపరిచిన అంశాలతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. గతేడాది డిసెంబరులో ప్రధానితో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

అకాల వర్షాల వల్ల హైదరాబాద్‌లో దెబ్బతిన్న రహదారులు, మౌలికవసతుల కల్పనకు అవసరమై ఆర్థిక సాయం అందించాలని అప్పట్లో సీఎం కేసీఆర్ కోరారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ ఇదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి: Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..