Telangana: స్మార్ట్ ఫోన్ వద్దు డబ్బా ఫోన్ ముద్దు.. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త ఫోన్లు.. పెద్ద కారణమే ఉందండోయ్..!

| Edited By: Shiva Prajapati

Aug 15, 2023 | 4:37 PM

స్మార్ట్ ఫోన్స్‌ని కొనేందుకు ఫోన్ లవర్స్ విపరీతమైన ఆసక్తి చూపుతుంటారు. ధనవంతులైతే.. కొత్తగా ఏ స్మార్ట్ ఫోన్ విడుదలైతే.. ఆ స్మార్ట్ ఫోన్‌ను కొనేస్తారు. అలాంటి వారిలో రాజకీయ నాయకులు సైతం ఉంటారు. ఈ కాలంలో స్మార్ట్ లేని నాయకుడైతే లేడనే చెప్పాలి. కానీ, ఇక్కడి నేతలు మాత్రం స్మార్ట్ ఫోన్ అంటేనే భయపడిపోతున్నారు. అమ్మ బాబోయ్ స్మార్ట్ ఫోనా.. నాకొద్దు అంటూ పక్కకు పోతున్నారు. స్మార్ట్ ఫోన్ వద్దు.. డబ్బా ఫోనే ముద్దు అంటూ అలనాటి ఫోన్లను వినియోగించేందుకే ఆసక్తి చూపుతురున్నారు. మరి స్మార్ట్‌ ఫోన్‌ను చూసి అంతలా..

Telangana: స్మార్ట్ ఫోన్ వద్దు డబ్బా ఫోన్ ముద్దు.. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త ఫోన్లు.. పెద్ద కారణమే ఉందండోయ్..!
BRS Party
Follow us on

స్మార్ట్ అంటే చాలా మంది ఆసక్తి చూపుతారు. రోజుకొక బ్రాండ్.. పూటకొక అప్‌డేటెడ్ వెర్షన్‌తో మార్కెట్‌లోకి విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్స్‌ని కొనేందుకు ఫోన్ లవర్స్ విపరీతమైన ఆసక్తి చూపుతుంటారు. ధనవంతులైతే.. కొత్తగా ఏ స్మార్ట్ ఫోన్ విడుదలైతే.. ఆ స్మార్ట్ ఫోన్‌ను కొనేస్తారు. అలాంటి వారిలో రాజకీయ నాయకులు సైతం ఉంటారు. ఈ కాలంలో స్మార్ట్ లేని నాయకుడైతే లేడనే చెప్పాలి. కానీ, ఇక్కడి నేతలు మాత్రం స్మార్ట్ ఫోన్ అంటేనే భయపడిపోతున్నారు. అమ్మ బాబోయ్ స్మార్ట్ ఫోనా.. నాకొద్దు అంటూ పక్కకు పోతున్నారు. స్మార్ట్ ఫోన్ వద్దు.. డబ్బా ఫోనే ముద్దు అంటూ అలనాటి ఫోన్లను వినియోగించేందుకే ఆసక్తి చూపుతురున్నారు. మరి స్మార్ట్‌ ఫోన్‌ను చూసి అంతలా భయపడటానికి కారణమేంటి? డబ్బా ఫోన్‌ను ఇష్టపడటం వెనుక రీజన్ ఏంటి? ఇంట్రస్టింగ్ పొలిటికల్ స్టోరీ మీకోసం..

అవును, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు కొత్త ఫోన్‌లు కొంటున్నారట. కొత్త ఫోన్లంటే.. లక్షల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ లు కాదండోయ్.. జస్ట్ రూ. 15,00 పెట్టి ఫీచర్ ఫోన్‌ను కొంటున్నారట. అదేంటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంది..? సన్న పిన్ను ఛార్జర్ ఫోన్‌లు కొనుడేంది? అని ఆశ్చర్యపోతున్నారు. అందుకు ఓ రిజన్ ఉంది మరి. ఈ కాలంలో ఎమ్మెల్యేలు అంటే.. సోకు సోకు కార్లు.. లక్షల రూపాయల ఫోన్ల మినియోగించే పరిస్థితి ఉంది. అలాంటిది.. స్మార్ట్ ఫోన్లు తప్ప.. ఎవరైనా ఫీచర్ ఫోన్‌లు కొంటున్నారా? కానీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు అంతా పాతకాలం నాటి ఫోన్‌ల వెంట పడ్డారట. ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఆపిల్ ఫోన్‌లు పీఏ లు, గన్ మెన్ లకు ఇచ్చి.. చిన్న ఫోన్ లను మాత్రం తమ వద్ద ఉంచుకుంటున్నారట లీటర్లు.

ఇక ఆ ఫోన్ లలో ఉండే నంబర్‌.. ఒక్కరికే ఇచ్చారట. వాళ్ళ ఇంటివారికి కూడా ఆ నెంబర్ తెలియదట. అన్ని ఫోన్లకు సైలెంట్ మోడ్ ఉన్నా.. స్విచ్ ఆఫ్ చేసినా.. ఆ చిన్న ఫోన్ మాత్రం పెద్ద రింగ్ టోన్ పెట్టుకొని.. పై జెబుల వేసుకుంటున్నారట. ఎప్పుడు మోగుతదా.. ఎప్పుడు ఎత్తుదమా అని ఎదురుచూస్తున్నరట. చిన్న ఫో‌న్‌ల స్టోరీ వెనక లీడర్లకు పెద్ద ప్లానే ఉందట. ఆ ఫోన్‌ల ఉండే నెంబర్‌ను ఒక్క ప్రగతి భవన్‌ల మాత్రమే ఇచ్చారట. ఎన్నికల టైం కాబట్టి.. అక్కడి నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా వెంటనే కలిసేట్లు ఉండేందుకే ఈ ప్లాన్ వేశారట. టిక్కెట్లు ఇచ్చే సమయం దగ్గర పడటంతో.. ప్రగతి భవన్ నుంచి ఎప్పుడు అయినా ఫోన్ రావొచ్చు. చిన్న ఫోన్‌లు అయితే.. సిగ్నల్ ఉండటం, పై జెబుల పెట్టుకోవడం ఈజీ కావడంతో లీడర్లు ఈ ప్లాన్ చేశారట.

ఇవి కూడా చదవండి

పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్‌లు ఉన్నా.. ఈ మూడు నెలలు ఈ చిన్న ఫోన్ లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు. గతంలో స్మార్ట్ ఫోన్‌లు ఎత్తక పోవడంతో చాలా ప్రాబ్లెమ్ వచ్చాయట. ప్రగతి భవన్‌కు అందుబాటులో ఉండాలంటే చిన్న ఫోన్‌లకు మించినది లేదని కొందరు మంత్రులు ఫాలో అవుతున్నది చూసి.. మిగతా వారంతా అదే పాటిస్తున్నారట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..