Telangana: ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు.. సుమోటో విచారణకు ఆదేశం

తెలంగాణ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ..

Telangana: ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు.. సుమోటో విచారణకు ఆదేశం
MLA Rajaiah harassing women sarpanch

Updated on: Mar 12, 2023 | 11:47 AM

తెలంగాణ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది. మాట విననందుకు తనపై స్టేషన్‌ ఘన్ పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించింది. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. ఇదంతా పార్టీలోని ఇంటి దొంగలు తన పై చేస్తున్న రాజకీయ కుట్ర అని రాజయ్య అంటున్నారు.

ఇదే వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి. ఇక సర్పంచ్‌ నవ్య వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుని స్పందించింది. రాజయ్యపై సర్పంచ్‌ చేసిన ఆరోపణలు నిజామా? కాదా? అనే అంశాలను తేల్చాలంటూ డీజీపీకి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ లేఖ ద్వారా విచారణకు ఆదేశించారు. ఒకవేళ సర్పంచ్‌ ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ నిర్ణయించినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.