Telangana: పోలీసులను చూసి రోడ్డుపైనే బోలెరో వదిలేసి డ్రైవర్‌ పరార్‌.. ఏంటా అని వాహనాన్ని తనిఖీ చేయగా..

|

Mar 28, 2024 | 11:05 AM

తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను స్మగ్లింగ్‌ చేయడం ప్రారంబించారు. తాజాగా 1300 కిలోల పేలుడు పదార్థాలను వాహనంలో తరలిస్తూ పోలీసులకు పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేయగా, మరొకరు పరారయ్యారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ బుధవారం (మార్చి 27) చోటు చేసుకుంది..

Telangana: పోలీసులను చూసి రోడ్డుపైనే బోలెరో వదిలేసి డ్రైవర్‌ పరార్‌.. ఏంటా అని వాహనాన్ని తనిఖీ చేయగా..
Explosive Material In Bolero
Follow us on

మహబూబాబాద్‌, మార్చి 28: తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను స్మగ్లింగ్‌ చేయడం ప్రారంబించారు. తాజాగా 1300 కిలోల పేలుడు పదార్థాలను వాహనంలో తరలిస్తూ పోలీసులకు పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేయగా, మరొకరు పరారయ్యారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ బుధవారం (మార్చి 27) చోటు చేసుకుంది. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్‌ కేకన్‌ కేసు వివరాలు వెల్లడించారు.

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ఎస్సై తాహేర్‌ బాబా ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అయితే వీరారం క్రాస్‌రోడ్డు వద్ద బొలెరో వాహనంలో ఉన్న కొందరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయగా, అందులో పెద్ద పెద్ద బాక్సులు కనిపించాయి. ఏవిటా అని బాక్సులను ఓపెన్‌ చేసి చెక్‌ చూడగా పేలుడు పదార్థాలకు సంబంధించిన ఐటెమ్స్‌ కనిపించాయి. అందులో జిలెటిన్‌ స్టిక్స్, ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు భారీగా లభించాయి. అదే వాహనంలో ప్రయాణిస్తోన్న ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. ఒకరు పరారయ్యారు. నిందితులను జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్‌ కిశోర్‌లుగా పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్ధాలను లైసెన్స్‌ ఉన్న వారు మాత్రమే నిర్ణీత పరిమాణంలో విక్రయించేందుకు అనుమతి ఉంటుంది. అయితే బోలెరో వాహనంలో నిందితుడు కుమార్‌కు వెంకటరమణ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరు మీద లైసెన్స్‌ ఉంది. ఆ లైసెన్స్‌ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను తరలించే పర్మిషన్‌ ఉండటంతో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో అనుమతి లేకుండా అక్రమంగా పేలుడు పదార్థాలను అమ్ముతూ వీరు పట్టుబడ్డట్లు ఎస్పీ రాంనాథ్‌ కేకన్‌ తెలిపారు. ఈ ఘటనలో పరారైన జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.