Telangana BJP: బీజేపీకి మళ్లీ షాక్‌.. వరంగల్‌ సభకు అనుమతి నిరాకరణ.. అసలేమైందంటే..?

|

Aug 26, 2022 | 7:00 AM

ఆగ్రహం వ్యక్తం చేసిన కమలం శ్రేణులు.. అర్ధరాత్రి ఏసీపీ ఆఫీస్‌ను ముట్టడించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పాడింది. పోలీసుల కక్ష్య సాధింపేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Telangana BJP: బీజేపీకి మళ్లీ షాక్‌.. వరంగల్‌ సభకు అనుమతి నిరాకరణ.. అసలేమైందంటే..?
Bandi Sanjay
Follow us on

Telangana BJP: బీజేపీకి మరో షాక్‌ తగిలింది. హన్మకొండలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న కాషాయం పార్టీ నోట్లో ఎలక్కాయ పడినట్లయింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్‌ ఇవ్వేలేమని ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు చెల్లించిన రెంట్‌ను కూడా వెనక్కు ఇచ్చేశారు. అయితే.. ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమలం శ్రేణులు.. అర్ధరాత్రి ఏసీపీ ఆఫీస్‌ను ముట్టడించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పాడింది. పోలీసుల కక్ష్య సాధింపేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సభ అనుమతిపై కూడా బీజేపీ ఇవాళ హైకోర్టులో కేసు వెయ్యనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఈనెల 27న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్​కాలేజీలో బీజేపీ భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఆయితే ఈ సభకు పోలీసు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. పోలీసుల పర్మిషన్‌ లేనందున తాము కూడా సభకు కాలేజీ గ్రౌండ్‌ ఇవ్వలేమని లెటర్‌ విడుదల చేసింది యాజమాన్యం. అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజాసంగ్రామ యాత్రకు నిన్న హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు.. అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

సభ ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతి రద్దు చేయడం సరికాదని బీజేపీ నేత మనోహర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని మనోహర్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీకి వస్తున్న స్పందనకు భయపడే సభకు అనుమతి నిరాకరించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి ఆరోపించారు. ఆరు నూరైనా సభ నిర్వహించి చూపిస్తామని సవాల్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో యాత్రకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో జనగాం సమీపంలోనే యాత్ర రద్దు చేసి.. ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ పార్టీ కోర్టులో పిటిషన్‌ వేసింది. విచారించిన కోర్టు యాత్రకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈ యాత్ర మళ్లీ మొదలుకానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి