యాత్రల బాటపట్టిన కమలం నేతలు.. ఖర్చులు ఎవరు పెడతారు? పార్టీలో ఎవరి అభిప్రాయమేమిటి.?

| Edited By: Ravi Kiran

Feb 05, 2024 | 1:02 PM

తెలంగాణలో యాత్రలకు సిద్ధం అవుతోంది కమలం పార్టీ. 5 పార్లమెంట్ క్లస్టర్‌లలో 5 యాత్రలకు ప్లాన్ చేస్తోంది. యాత్రలపై పార్టీలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పుడు యాత్రలు అవసరమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

యాత్రల బాటపట్టిన కమలం నేతలు.. ఖర్చులు ఎవరు పెడతారు? పార్టీలో ఎవరి అభిప్రాయమేమిటి.?
Telangana BJP
Follow us on

తెలంగాణలో యాత్రలకు సిద్ధం అవుతోంది కమలం పార్టీ. 5 పార్లమెంట్ క్లస్టర్‌లలో 5 యాత్రలకు ప్లాన్ చేస్తోంది. యాత్రలపై పార్టీలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పుడు యాత్రలు అవసరమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీ పలు కార్యక్రమాలు చేస్తోంది. కొన్ని జరుగుతుంటే.. మరికొన్నింటిని చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి యాత్ర నిర్వహణ కమిటీని కూడా ఆ పార్టీ వేసింది. సన్నాహక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కూడా యాత్రల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా యాత్రలకు రూపకల్పన చేస్తోంది బీజేపీ. పార్లమెంట్ క్లస్టర్ వారీగా యాత్రలు నిర్వహించాలని ప్రణాళికను సిద్దం చేసింది.

17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఆ పార్టీ 5 క్లస్టర్‌లుగా విభజించింది. క్లస్టర్ వారీగా యాత్రలకు రెడీ అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఈ యాత్రలు నిర్వహించడంపై పార్టీలో కొందరు గుసగుసలాడుతున్నారట. ఇన్ని కార్యక్రమాలు ఇచ్చి మళ్లీ యాత్రలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.! యాత్రలు ఎవరు లీడ్ చేస్తారు.. ఖర్చు ఎలా..? పార్టీ ఖర్చు పెట్టుకుంటుందా అని అడుగుతున్నారట. ఎన్నికల టైమ్‌లో సొంతంగా డబ్బులు పెట్టుకోవడం అంటే ఎలా.? అభ్యర్థులు ఉన్న చోట తమకే సీటు వస్తుందన్న నమ్మకంతో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్యాండిడేట్‌లు డబ్బులు పెట్టుకునే అవకాశం ఉంటుంది.

దీంతో అక్కడ ఎఫెక్టివ్ యాత్రలు జరుగుతాయి. కానీ మిగతా చోట్ల ఆ ప్రభావం ఉండదు. అలాంటప్పుడు అది కూడా ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు నారాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ వీక్ గా ఉందని భావిస్తున్న చోట యాత్రలు సక్సెస్ చేయడం అంత ఈజీ కాదని కమలం నేతలే అనుకుంటున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తే ఆ సంగతేదో వాళ్ళే చూసుకుంటారని సలహా కూడా ఇస్తున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యాత్రల పై నిర్ణయం తీసుకోవాలని… ఏదో నాం కే వాస్తే ఉండొద్దని అంటున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు ఉన్నాయి.