Bandi Sanjay – Social Media Promotion: పొలిటికల్ పబ్లిసిటీ ట్రెండ్ మారింది. రాజకీయా పక్షాలన్నీ సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నేతలు సోషల్ మీడియా ఖర్చులో అగ్రభాగాన దూసుకుపోతున్నారు.
సోషల్ మీడియాలో పొలిటికల్ న్యూస్ ట్రెండ్ పెరిగింది. పబ్లిసిటీకి విరివిగా ఫేస్ బుక్ , యూట్యూబ్ వాడుతున్నారు. 2019 నుంచి దేశంలోని అన్ని పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియా ప్రచారానికి దాదాపుగా 188 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఫేస్ బుక్ లో ప్రచారం ఖర్చులో అగ్రభాగాన నిలుస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత నెల రోజులుగా ఫేస్ బుక్ లో ప్రచారానికి నాలుగు లక్షల 95 వేల రూపాయలు వ్యయం చేశారు. ఫేస్ బుక్ ప్రకటనల్లో తెలంగాణ బీజేపీ వ్యయం దేశంలో 5 స్థానంలో బండి సంజయ్ ని నిలబెట్టింది.
ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో పబ్లిసిటీ కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని పార్టీ ఆర్ధిక వ్యవహారాల ఇంఛార్జ్ లు చెబుతున్నారు. ఇక వైఎస్ షర్మిల కూడా సోషల మీడియా ప్రచారం కోసం ఖర్చు భారీగానే పెడుతున్నారు. ఫేస్ బుక్ కు గత నెల రోజులుగా 60 వేల రూపాయలు వెచ్చించారు. మొత్తానికి వచ్చే ఎన్నికలకు సోషల్ మీడియాలో ప్రచారానికి అన్ని రాజకీయ పక్షాలు భారీగా ఖర్చు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.