Bandi Sanjay: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ట్వీట్.. ఏమన్నారంటే..?

|

Mar 11, 2022 | 1:16 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో యశోదాతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ 20 మంది వైద్యుల బృందం.. సీఎంకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.

Bandi Sanjay: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ట్వీట్.. ఏమన్నారంటే..?
Bandi Sanjay Cm Kcr
Follow us on

CM Kcr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో యశోదాతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ 20 మంది వైద్యుల బృందం.. సీఎంకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా సీఎం అస్వస్థత గురించి తెలిసి.. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ గురించి ట్వీట్ వేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని బండి సంజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా సీఎం కేసీఆర్‌కు యాంజియోగ్రామ్‌ రిపోర్ట్ నార్మల్‌గా వచ్చింది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్స్‌ లేవు. అలాగే గుండె సంబంధిత ఇబ్బందులు కూడా ఏమీ లేవని తేలింది. ముందుజాగ్రత్తగా CT స్కాన్‌తోపాటు.. మరికొన్ని ఇతర పరీక్షలు నిర్వహించారు. CM కేసీఆర్ 2 రోజులుగా కాస్త నీరసంగా ఉన్నారని ఆయన్ను రెగ్యులర్‌గా పరీక్షించే ఫ్యామిలీ వైద్యుడు డాక్టర్‌ ఎంవీ రావు చెప్పారు. ఎడమచేయి కూడా కొంచెం లాగుతున్నట్లు చెప్పడంతో… జనరల్ చెకప్‌లో భాగంగా ప్రాథమిక టెస్టులు చేశారు. అనంతరం యాంజియోగ్రామ్‌ కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు CM కేసీఆర్. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.

Also Read: CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు