Telangana BJP: 119 స్థానాలు.. 6003 అప్లికేషన్లు.. బీజేపీ టికెట్ల కోసం పోటెత్తిన దరఖాస్తులు.. ఐదు స్థానాలకు నటి జీవిత దరఖాస్తు..

|

Sep 11, 2023 | 8:03 AM

అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో స్పీడ్ పెంచాయి. ప్రధానంగా.. తెలంగాణలో కమలం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ సర్కార్‌ను ఢీకొట్టి.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహ రచనలు సిద్ధం చేసింది.

Telangana BJP: 119 స్థానాలు.. 6003 అప్లికేషన్లు.. బీజేపీ టికెట్ల కోసం పోటెత్తిన దరఖాస్తులు.. ఐదు స్థానాలకు నటి జీవిత దరఖాస్తు..
Telangana BJP
Follow us on

అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో స్పీడ్ పెంచాయి. ప్రధానంగా.. తెలంగాణలో కమలం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ సర్కార్‌ను ఢీకొట్టి.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహ రచనలు సిద్ధం చేసింది. ఇప్పటికే.. సునీల్ బన్సల్ నేతృత్వంలో బీజేపీ వ్యూహలను రచిస్తోంది. ఈ క్రమంలోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు బీజేపీ నేతలు. దీంతో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్‌లకు భారీ పోటీ నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేవారి దరఖాస్తులు పోటెత్తాయి. ఆశావహుల నుంచి గత వారం రోజులుగా బీజేపీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. నిన్నటితో అప్లికేషన్స్‌కు గడువు ముగిసింది. అయితే.. ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. 119 సీట్లకు 6వేలకు పైగా దరఖాస్తులు రావడం ఆసక్తి రేపుతోంది.

సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీకి 6003 అప్లికేషన్లు వచ్చాయి. ఇక.. చివరి ఒక్కరోజే 2,781 దరఖాస్తులు రావడం ఆసక్తిగా మారింది. అయితే.. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. ఒక్కొక్కరూ 3, 4 స్థానాలకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్న స్థానం దక్కకపోతే మరో చోటైన అవకాశం దక్కుతుందనే ఆశతో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

దరఖాస్తులు ఇలా..

  • తొలిరోజు.. సెప్టెంబర్ 4న 182 దరఖాస్తులు
  • రెండో రోజు.. 5వ తేదీన 178 దరఖాస్తులు
  • మూడో రోజు 6వ తేదీన 306 దరఖాస్తులు
  • నాల్గవ రోజు 7వ తేదీన 333 దరఖాస్తులు
  • ఐదవ రోజు 8వ తేదీన 621 దరఖాస్తులు
  • ఆరో రోజు 9 వ తేదీన 1603 దరఖాస్తులు
  • ఏడో రోజు సెప్టెంబర్ 10న 2781 దరఖాస్తులు

ఏడు రోజుల్లో మొత్తం.. 6003 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్లికేషన్లు దాఖలు చేశారు కమలం పార్టీ ఆశావహులు. మరోవైపు.. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు సినీనటి జీవిత రాజశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ స్థానాలకు జీవిత రాజశేఖర్ దరఖాస్తు చేశారు. వాస్తవానికి.. తొలి రోజే ఆశావాహుల నుంచి విశేష స్పందన లభించగా.. గడువు ముగిసే నాటికి వెయ్యికిపైగా దరఖాస్తులు వస్తాయనుకున్నారు. కానీ.. అనూహ్యంగా.. 6వేలకు పైగా అప్లికేషన్స్‌ రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

బీజేపీలో అభ్యర్థుల ఎంపికకు సరికొత్త సంప్రదాయాన్ని అమలు చేసిన కమలం పార్టీ అభ్యర్థుల జాబితాపై మూడు దశల్లో వడపోత చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి.. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. రాష్ట్ర పార్టీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత జాతీయ కమిటీకి జాబితా చేరనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. మొత్తంగా.. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి నేపథ్యంలో ఇకపై బీజేపీ మరింత దూకుడు పెంచనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..