పదవ తరగతి పేపర్ లీక్ పై బండి సంజయ్ ను 14 రోజుల రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాజాగా బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు లేఖ రాశారు. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని తెలిపారు. పదవ తరగతి పేపర్ లీకేజీ విషయంలో కేటీఆర్ ను ప్రశ్నించినందుకే తనపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మజ్లీస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులతో దోస్తీ చేస్తున్నారని రాసుకొచ్చారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బొమ్మవరామారం పోలీసులు బండ్ సంజయ్ పట్ల అనుచితంగా వ్యవహరించారని తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ కు బండి సంజయ్ అడ్వకేట్ రామచంద్ర రావు ఫిర్యాదు చేశారు. బొమ్మల రామారం వెళ్లకుండా తనను అడ్డుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..