Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు భారతీయ జనతా పార్టీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ కార్యదర్శుల(Panchayat Secretaries)పై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. అలాగే, ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై నిత్యకృత్యంగా మారడం దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపి ఉద్యోగిగా క్రమబద్ధీకరించి, పే స్కేల్ అమలు చేయాల్సిన భార్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతో పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని బండి సంజయ్ రాసిన లేఖలో గుర్తు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల పంచాయతీ కార్యదర్శులపై నిత్యం దాడులు జరగడం బాధాకరమన్నారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనో ధైర్యం కల్పించి, ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,765 గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలి. ఇదే విషయమై @TelanganaCMO కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. pic.twitter.com/CYQofgl8Qi
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2022
Read Also…. Hijab: హిజాబ్ పై ఆందోళనలు వద్దు.. కోర్టులో న్యాయపోరాటం చేద్దామన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు..