Telangana Elections: ఎన్నికల వేళ పోలీసులకు కొత్త తలనొప్పులు.. పైరవీలతో కొత్త పరేషాన్..!

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేస్తోన్నారు. నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగదు తరలివస్తుందనే సమాచారంతో మరింత అప్రమత్తమై రాష్ట్ర బోర్డర్లలో కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ తనిఖీలలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతోంది

Telangana Elections: ఎన్నికల వేళ పోలీసులకు కొత్త తలనొప్పులు.. పైరవీలతో కొత్త పరేషాన్..!
Hyderabad Police Seized Money

Edited By:

Updated on: Oct 25, 2023 | 9:15 AM

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తరలిస్తున్న కోట్లాది రూపాయల నగదు దొరుకుతున్నాయి. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే పోలీసులకు కొత్త చిక్కలు తెచ్చిపెడుతున్నాయి. వాళ్లు మావాళ్ళే అంటూ పైరవీలు చేస్తూ క్షేత్రస్థాయి పోలీసులకు అధికారుల చేత ఫోన్లు చేపిస్తున్నారట కొందరు పట్టుబడ్డ బడా బాబులు. దీంతో డబ్బు స్వాధీనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. వాటిని వదిలేయండి అంటూ వచ్చేటటువంటి కాల్స్ పోలీసులకు పెద్ద తల నొప్పిగానే మారింది.

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేస్తోన్నారు. నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగదు తరలివస్తుందనే సమాచారంతో మరింత అప్రమత్తమై రాష్ట్ర బోర్డర్లలో కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ తనిఖీలలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతోంది. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్నవారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు

ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా డబ్బుతో పాటు బంగారం, వెండి నగలను, మద్యం, మత్తు పదార్థాలను వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే తనిఖీల్లో భాగంగా ఈ విధంగా భారీ ఎత్తున పట్టబడుతుండటంతో.. ఆయా ప్రదేశాల్లో కొందరు రాజకీయ నాయకులతో పాటు కొన్ని సందర్భాల్లో పలువురు ఇతర అధికారులు కూడా జోక్యం చేసుకుంటున్నట్టు సమాచారం. ఫలానా వ్యక్తి తమకు తెలిసిన వాడని.. పట్టుకున్న సొత్తును వదిలివేయాలంటూ పోలీసులకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారట. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారట స్థానిక పోలీసులు.

ముఖ్యంగా ఎవరైనా ప్రముఖులకు సంబంధించిన సొత్తు పట్టుబడిందని తెలిసిన వెంటనే కొంత సేపటి వరకు పోలీసులకు అజ్ఞాతంలోకి వెళ్ళినంత పని అవుతుందట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలను పోలీస్ శాఖ సవాల్ తీసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే సొత్తు స్వాధీనానికి సంబంధించి పోలీస్ స్టేషన్ల మధ్య పెద్ద పోటీనే నెలకొంది. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది అని పోలీసుల చెప్పగానే.. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోను భారీ ఎత్తున బంగారం పట్టుబడిందని, మద్యం బాటిల్లో పట్టుబడ్డాయనో, నగదు పట్టుబడ్డాయనో సమాచారం ఇస్తున్నారు పోలీసులు.

ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన డబ్బు బంగారం పట్టుబడినట్లు ఎక్కడ నిర్ధారణ కాలేదు చాలావరకు వ్యాపారులు సామాన్లతో పాటు కొంతమంది హవాలా వ్యాపారులకు సంబంధించిన సొత్తు పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేకపోవడం వల్ల సొత్తు స్వాధీనం చేసుకుంటున్నారు. ఏదైనా వస్తువులను కానీ, నగదును కానీ తరలించాల్సి వస్తే.. ముందుగా ఎన్నికల కమిషన్ రూపొందించిన యాప్ లో నమోదు చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకు తీసుకు వెళ్లడం కుదరదని ఎన్నికల కమిషన్ చెప్తోంది. అయితే ముందుగా యాప్ లో నమోదు చేసుకోకపోవడం వల్లనే స్వాధీనం చేసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. దీనిపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. తనిఖీల విషయంలో క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిళ్ళకు తలగొద్దని, పట్టుబడ్డ సొత్తును నిబంధనల ప్రకారం గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…