తెలంగాణలో జనసేన పోటీపై రాని క్లారిటీ.! బీజేపీతో పొత్తు ఉందా.? లేదా.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. దీనిపై కేంద్ర నాయకత్వంతో బీజేపీ నేతలు చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. దీనిపై కేంద్ర నాయకత్వంతో బీజేపీ నేతలు చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో వీరంతా చర్చలు జరిపి పొత్తులపై ఒక అంగీకారానికి వచ్చే అవకాశముంది. ఇదే సమావేశంలో జీహెచ్‌ఎంసీ పరిధి సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని సమాచారం. జనసేన ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఇప్పటికే వ్యక్తపరిచారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇటీవల పవన్‌కల్యాణ్‌ను కలసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించారు. అయితే జనసేన పోటీ చేసే అవకాశం ఉందనుకున్న 32 స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందా… ముఖ్యంగా జనసేన అడుగుతున్నట్టు గ్రేటర్ కూకట్ పల్లి వంటి స్థానాలను బీజేపీ కేటాయిస్తుందా… ఇలాంటి విషయంలో ఇప్పటికీ స్పష్టత కరవైంది. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ ముఖ్య నేతలు ఢిల్లీ టూర్.. అలాగే పవన్ కూడా ఢిల్లీ వెళ్లే చాన్సుందన్న వార్తలు సహజంగానే తెలంగాణలో ఆసక్తి రేపుతున్నాయి.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

