Telangana Election Exit Polls: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌన్ బనేగా తెలంగాణ సీఎం..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఏం తేలిందంటే..

|

Nov 30, 2023 | 6:30 PM

Telangana Assembly Elections Exit Poll Results 2023: తెలంగాణ దంగల్ ముగిసింది.. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల క్యూలైన్లలో నిలబడి ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిర్లిప్తమైంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Telangana Election Exit Polls: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌన్ బనేగా తెలంగాణ సీఎం..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఏం తేలిందంటే..
Telangana Elections
Follow us on

Telangana Assembly Elections Exit Poll Results 2023: తెలంగాణ దంగల్ ముగిసింది.. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల క్యూలైన్లలో నిలబడి ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిర్లిప్తమైంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, తెలంగాణకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ను ‘పోల్ స్ట్రాట్ సర్వే’ విడుదల చేసింది. ఆసక్తికర రాజకీయ విశ్లేషణలను, ఓటర్ల మనోగతాన్ని సేకరించిన పోల్ స్ట్రాట్ సర్వే కీలకమైన అంచనాలను రూపొందించింది.

తెలంగాణలో హోరాహోరి పోరు..

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఫైట్ ఉన్నట్లు పోల్ స్ట్రాట్ సర్వే వెల్లడించింది. 119 నియోజకవర్గాల్లో జరిగిన హోరాహోరి పోరుపై ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన పోల్ స్ట్రాట్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగినట్లు పేర్కొంది. పోల్ స్ట్రాట్ అంచనాల ప్రకారం..

పోల్ స్ట్రాట్ సర్వే..

  • కాంగ్రెస్ 49-59
  • బీజేపీ 5-10
  • బీఆర్ఎస్ 48-58
  • ఎంఐఎం-ఇతరులు 6-8 వస్తాయంటూ పోల్ స్ట్రాట్ అంచనా వేసింది.

సర్వేలు ఇలా..

CNN : BRS 56 , Congress 48, BJP 10, MIM 05

AARAA : BRS 41-49, Congress 58-67, BJP 5-7, MIM 6-7, Others 1-2

Jan Ki Baat : BRS 40-55, Congress 48-64, BJP 7-13, MIM 4-7

Chanakya : BRS 22-31, Congress 67-78, BJP 6-9, MIM 6-7

Political Graph: BRS 68, Congress 38, BJP 5, MIM 7, Others 1

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..