సాధారణంగా ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక దృష్టి పెడతారు. చాల మందిని బైండోవర్ చేశామన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. బైండోవర్ అంటే ఏమిటి..? బైండోవర్ ఎవరిని చేస్తారు..? ఒకసారి తెలుసుకుందాం..!
ఎన్నికల సమయం ఆసన్నమైదంటే చాలు.. రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి తమ శక్తికి తగిన ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణలో ప్రచారం హోరెత్తుతుంది..పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల ఏర్పాట్లను ఎలక్షణ్ కమిషన్ సమీక్షిస్తుంది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ విషయంలో కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో పాత నేరస్థులపై నిఘా పెట్టింది రాష్ట్ర పోలీస్ శాఖ, ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా వారిని బైండోవర్ చేస్తోంది.
ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లను, బెల్టు దుకాణాలు నిర్వహించే వారితోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా చర్యలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం. ఎన్నికల సందర్భంగా ఎవరి చర్యల పైనా అనుమానం వచ్చినా అలాంటి వ్యక్తులను పోలీసులు.. మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ ఎదుట హాజరు పరుస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. ఇలా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విడుదల చేసేందుకు వారితో బాండ్ పేపర్ రాయించుకుంటారు. చట్ట వ్యతిరేక పనులు చేయబోమని బాండ్‌పై లిఖిత పూర్వక హామీతో సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేస్తారు. ఈ ప్రక్రియను బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ సత్ప్రవర్తనకు హామీ అంటారు.
తహసీల్దార్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై రాత పూర్వకంగా ఇచ్చిన హామీని మితిమీరడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. బైండోవర్ సమయంలో నేర చరితులు, అనుమానితులు బాండ్‌లో రాసిచ్చిన హామీని అతిక్రమిస్తే దానిని బౌండ్ డౌన్ అంటారు. దీనిపై భారతీయ శిక్షాస్మృతి 107, 108, 109, 110 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. బైండోవర్ అయిన వ్యక్తి శిక్షను తప్పించుకునేందుకు పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇదంతా బౌండ్ డౌన్ చేసిన వారి వివరాలతో పోలీసులు నివేదికను తయారు రూపొందిస్తారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఇలా బైండోవర్ చేస్తుంటారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…