Telangana Election Result: బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాల్లో అనుహ్య ఫలితాలు.. గెలిచిందెవరు.. ఓడిదెవరు..?

| Edited By: TV9 Telugu

Dec 03, 2023 | 5:50 PM

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదిపిన బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల మార్పు లేకుండానే రంగంలోకి దింపింది. అయితే అనుహ్యంగా అభ్యర్థులను మార్చిన కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.

Telangana Election Result: బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాల్లో అనుహ్య ఫలితాలు.. గెలిచిందెవరు.. ఓడిదెవరు..?
Brs Party
Follow us on

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదిపిన బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల మార్పు లేకుండానే రంగంలోకి దింపింది. అయితే అనుహ్యంగా అభ్యర్థులను మార్చిన కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం మిగతా పార్టీల కంటే ముందుగానే తొలి విడతలో 115 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆ స్థానం మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించారు.

తొలుత అలంపూర్ టికెట్‌ను మొదట సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు ఇచ్చిన బీఆర్ఎస్ తర్వాత ఆ స్థానానికి విజయుడికి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కోరుట్ల టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్‌కు కేటాయించారు. ఉప్పల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్, స్టేషన్ ఘన్‌పూర్, వైరా, వేములవాడల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. హుజూరాబాద్ టికెట్‌ను పాడి కౌశిక్ రెడ్డికి కేటాయించిన కేసీఆర్.. దుబ్బాక నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి పోటీ చేసే అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో.. టికెట్‌ను ఆయన కుమార్తె లాస్యకు కేటాయించారు. రెండో విడతలో నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు.

అయితే అనుహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చిన చోట అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. ఒకసారి ఎవరెవరూ గెలిచారో చూద్దాం..

బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాలు.

అలంపూర్ – అబ్రహం స్థానంలో విజయుడికి సీటు గెలుపు.
జనగాం – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు కేటాయింపు. ఫలితం గెలుపు.
స్టేషన్ ఘనపూర్ – తాటికొండ రాజయ్య స్థానంలో… కడియం శ్రీహరికి అవకాశం. ఫలితం గెలుపు.
నర్సాపూర్ – మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం. ఫలితం గెలువు.
కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు డా:కల్వకుంట్ల సంజయ్ రావుకు అవకాశం. ఫలితం గెలుపు.
అసిఫాబాద్ – ఆత్రం సక్కు స్థానంలో కోవాలక్ష్మీకి అవకాశం. ఫలితం గెలుపు.
దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డికి అవకాశం. ఫలితం గెలువు.
బోథ్ – రాథోడ్ బాబురావు స్థానంలో అనిల్ జాదవ్‌కు అవకాశం. ఫలితం గెలువు.
ఇక ఉప్పల్ నియోజకవర్గంలో బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం కల్పించారు. ఫలితం గెలువు.
మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మైనం పల్లి హన్మంతరావు స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి అవకాశం కల్పించింది బీఆర్ఎస్. ఇక్కడ ఫలితం విజయం.
ఖానాపూర్ నియోజకవర్గంలో రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ కు అవకాశం దక్కింది. ఫలితం ఓటమి..
వేములవాడ నియోజకవర్గంలో ప్రో. రమేష్ బాబు స్థానంలో చల్మెడ లక్ష్మినర్సింహారావుకు సీటు కేటాయించింది బీఆర్ఎస్ . ఇక్కడ మాత్రం ఓటమి పాలయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్