Telangana Assembly Budget Session: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్చి 7వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే, ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండబోదని, సీఎం కేసీఆర్ ఆమేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారవర్గాల సమాచారం. కాగా, రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. మార్చి7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశాల్లో భాగంగా విధిగా వస్తున్న గవర్నర్ ప్రసంగం ఉండబోదని, నేరుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం అందుతోంది. అయితే, సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
గవర్నర్ ప్రసంగం ఉండబోదంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేకెత్తిస్తోంది. అయితే, ఈ విధానం ఇప్పుడేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలా జరిగిందని గుర్తు చేస్తున్నారు అసెంబ్లీ అధికార వర్గాలు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సందర్భంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారు. ఇక 1970 లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలను ఉదాహరణగా చూపుతున్నారు అధికారులు. ఇదిలాఉంటే.. మనరాష్ట్రంలోనే గాక.. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో 2021 బడ్జెట్ సమావేశాలకు అక్కడి ప్రభుత్వం కూడా గవర్నర్‌ను ఆహ్వానించలేదు.
Also read:
కన్న కొడుకు క్రూరత్వం.. డబ్బుల కోసం వేధించి.. రాయితో కొట్టి
Russia-Ukraine Crisis: బెలారస్‌లో కొనసాగుతున్న చర్చలు.. భారతీయులకు కొత్త మార్గదర్శకాలు జారీ