Heat Wave: ఎండలు బాబోయ్‌ ఎండలు.. ఇక నుంచి రికార్డులన్నీ బద్దలవుతాయట.. బయటకు వెళితే జాగ్రత్త

వేసవి కాలం మొదలైంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే.. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే.. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Heat Wave: ఎండలు బాబోయ్‌ ఎండలు.. ఇక నుంచి రికార్డులన్నీ బద్దలవుతాయట.. బయటకు వెళితే జాగ్రత్త
Heat Wave

Updated on: Feb 15, 2025 | 11:11 AM

వేసవి కాలం మొదలైంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే.. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భాస్కరుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటకముందే ఎండవేడిమి మొదలైంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండలో, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల పెరిగాయి. గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటోంది.

ఫిబ్రవరిలోనే ఇలా ఎండలుమండిపోతే.. ఇక మేనెల వచ్చేనాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చన ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదయ్యాయి. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని వాతావరణ శాఖ సూచించింది.

తెలంగాణ లోని మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

  • మహబూబ్ నగర్.. 37.5
  • భద్రాచలం..36.8
  • ఖమ్మం..36.6
  • మెదక్..35.6
  • హైదరాబాద్..35.2
  • హనుమకొండ.. 35
  • ఆదిలాబాద్..34
  • రామగుండం. 33.8
  • నిజామాబాద్..33.5
  • నల్లగొండ.. 33.2 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

శనివారం గరిష్టంగా మహబూబ్ నగర్ లో 36.7, కనిష్టంగా నల్లగొండ లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..