Telangana Schools Reopen: మరికొద్దీ గంటల్లో మోగనున్న బడిగంట.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరుచుకోనున్న విద్యా సంస్థలు!

|

Jan 31, 2022 | 7:08 PM

తెలంగాణలో విద్యాసంస్థల రీ ఒపెనింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొద్దీ గంటల్లో రాష్ట్రంలో బడి గంట మోగనుంది. కరోనా థార్డ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి.

Telangana Schools Reopen: మరికొద్దీ గంటల్లో మోగనున్న బడిగంట..  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరుచుకోనున్న విద్యా సంస్థలు!
School
Follow us on

Telangana Schools Reopen: తెలంగాణలో విద్యాసంస్థల(Educational Institutions) రీ ఒపెనింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొద్దీ గంటల్లో రాష్ట్రంలో బడి గంట మోగనుంది. కరోనా థార్డ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఒమిక్రాన్(Omicron) వ్యాప్తి నేపథ్యంలో జనవరి 8 నుంచి 31 వరకు కళాశాల, పాఠశాలల(Schools)ను మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ఇవాళ్టి వరకు విద్యా సంస్థలు మూతపడ్డాయి.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు రెడీ అయ్యాయి. ఈమేరకు విద్యాసంస్థల్లో శానిటేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు పాఠశాల యాజమానులు. దీనిపై మరింత సమాచారం మాప్రతినిధి విద్యా సాగర్ అందిస్తారు.

మరోవైపు యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలని ఓయూ, జేఎన్టీయూ నిర్ణయించాయి. అన్ని సెమిస్టర్లకు ఫిబ్రవరి 12వరకు ఆన్ లైన్ పాఠాలే చెప్పాలని ఉస్మానియా యూనివర్శిటీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక బి.టెక్, బీ పార్మసీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు, థర్డ్, పోర్త్ ఇయర్స్ స్టూడెంట్స్ కు ఆఫ్ లైన్ క్లాసులు ఉంటాయని జెఎన్‌టీయూ ప్రకటించింది.

ముఖ్యంగా హాస్టళ్ల నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అధికారులు. హాస్టళ్లు తెరిచినా విద్యార్థుల శాతం పరిమితంగానే ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నారు అధికారులు. దగ్గర్లోని విద్యార్థులను వారం పాటు ఇంటి నుంచే స్కూలుకు రావాలని చెప్తున్నారు. మరోవైపు వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో సిలబస్ పూర్తి చేయడంపై ఫోకస్ చేస్తున్నారు.

Read Also…. West Bengal: రాష్ట్ర ముఖ్యమంత్రి – గవర్నర్ మధ్య ముదురుతున్న ‘ట్వీట్’ వివాదం!