School Holidays: తెలంగాణలో 4 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు? కారణం ఏంటో తెలుసా?

School Holidays: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ముగిశాయి. తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పుడు మరో నాలుగు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తే విద్యార్థులకు ఇక పండగే. ఇప్పటికే వరుస సెలవులతో ఎంజాయ్ చేసిన విద్యార్థులు..

School Holidays: తెలంగాణలో 4 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు? కారణం ఏంటో తెలుసా?
School Holidays

Updated on: Jan 18, 2026 | 6:52 PM

School Holidays: పాఠశాల విద్యార్థులకు ఈ నెలలో మరిన్ని సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా ఏపీ, తెలంగాణలో సెలవులు ముగియనున్నాయి. తెలంగాణలో జనవరి 16తో సంక్రాంతి సెలవులు ముగియగా, 17న శనివారం వచ్చింది. అయితే కొన్ని పాఠశాలలు జనవరి 19 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక ఈ సెలవులు ముగియడంతోనే ఈ నెల చివరిలో మరో నాలుగు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడారం జాతర నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జనవరి 28 నుంచి 31 వరకు ఈ మేడారం జాతర జరుగుతుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు తరలివస్తారు. ఈ సమయంలో రహదారులు, బస్సులు, రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి.

సమ్మక్క–సారలమ్మ గిరిజన దేవతల జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులు మొక్కులు చెల్లించడం, బంగారం సమర్పించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణలు. అడవుల నడుమ జరిగే ఈ జాతరకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో మేడారం జాతర సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పీర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే జరిగితే మరోసారి విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. అలాగే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కూడా వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరి మేడారం జాతర సందర్భంగా సెలవులను ప్రకటించాలనే డిమాండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Investments Plan: కేవలం రూ.1000తో పెట్టుబడి ప్రారంభిస్తే చేతికి రూ.11.57 కోట్లు.. కాసులు కురిపించే స్కీమ్‌!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి