TSPSC paper leak case: పొలాలు తాకట్టు పెట్టి మరీ ప్రశ్నపత్రాలు కొనుగోలు.. ముగ్గురికి 5 రోజుల కస్టడీ

|

Mar 31, 2023 | 7:31 AM

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసేందుకు కొందరు తమ పొలాలను తాకట్టు పెట్టినట్లు విచారణలో తేలింది. ప్రవీణ్‌కుమార్‌కు రెండు దఫాలుగా..

TSPSC paper leak case: పొలాలు తాకట్టు పెట్టి మరీ ప్రశ్నపత్రాలు కొనుగోలు.. ముగ్గురికి 5 రోజుల కస్టడీ
TSPSC paper leak case
Follow us on

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసేందుకు కొందరు తమ పొలాలను తాకట్టు పెట్టినట్లు విచారణలో తేలింది. ప్రవీణ్‌కుమార్‌కు రెండు దఫాలుగా రూ.10 లక్షలు చెల్లించి రేణుక, డాక్యానాయక్‌ దంపతులు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేశారు. వాటిని కె నీలేష్‌నాయక్‌, పి గోపాల్‌నాయక్‌లకు రాజేశ్వర్‌నాయక్‌ అనే మధ్యవర్తి ద్వారా రూ.13 లక్షల 50 వేలకు విక్రయించాడు. తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా రాజేందర్‌కుమార్‌కు రూ.5 లక్షలకు అమ్మాడు. ప్రశాంత్‌రెడ్డికి రూ.7 లక్షల 50 వేలకు అమ్మాడు.

వీరిలో నీలేష్‌నాయక్‌, గోపాల్‌నాయక్‌, రాజేందర్‌కుమార్‌లు తమ ఊర్లలోని పంట పొలాలను తాకట్టు పెట్టి మరీ డబ్బు చెల్లించారు. నీలేష్‌నాయక్‌, గోపాల్‌నాయక్‌, ప్రశాంత్‌రెడ్డిలు అప్పులు చేసి, నగలు తనఖాపెట్టి డబ్బు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ నలుగురికే కాకుండా మరో 11 మందికి ఏఈ ప్రశ్నపత్రాలు చేరినట్టు సిట్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరోవైపు గ్రూప్‌-1 పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన కమిషన్‌లో కిందిస్థాయి ఉద్యోగులు రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌లను అయిదు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతినివ్వడంతో వారిని బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి తరలించారు. ఈ ముగ్గురు ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం విక్రయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.