Khammam: కానిస్టేబుల్ ఫలితాల్లో దక్కిన కొలువు.. విజయానికి ముందే కొడుకు మృతి! గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు

బాగా చదువుకుని సర్కార్ కొలువు దక్కిచుకోవాలని కలలు కన్నాడా యవకుడు. అనుకన్నట్లు గానే తాజాగా రాష్ట్రంలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం సివిల్‌ సర్వీసెస్‌లో కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో దేశ రాజధానికి వెళ్లి ఉన్నత కొలువే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటూ ఉండగా అనుకోని ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. యువకుడి మరణం అనంతరం తాజాగా బుధవారం రాత్రి..

Khammam: కానిస్టేబుల్ ఫలితాల్లో దక్కిన కొలువు.. విజయానికి ముందే కొడుకు మృతి! గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
Praveen Family

Updated on: Oct 06, 2023 | 8:36 PM

టేకులపల్లి, అక్టోబర్‌ 6: బాగా చదువుకుని సర్కార్ కొలువు దక్కిచుకోవాలని కలలు కన్నాడా యవకుడు. అనుకన్నట్లు గానే తాజాగా రాష్ట్రంలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం సివిల్‌ సర్వీసెస్‌లో కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో దేశ రాజధానికి వెళ్లి ఉన్నత కొలువే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటూ ఉండగా అనుకోని ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. యువకుడి మరణం అనంతరం తాజాగా బుధవారం రాత్రి ప్రకటించిన పోలీసు కానిస్టేబుల్‌ ఫలితాల్లో విజేతగా నిలవడంతో.. కొడుకు విజయాన్ని విని, భౌతికంగా దూరమైన అతణ్ని గుర్తుచేసుకుంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ హృదయవిదారక ఘటన తెలంగానలోని ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పాతతండాకు చెందిన భూక్య ప్రేమ్‌కుమార్‌, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు ప్రవీణ్‌ (22) బీటెక్‌ పూర్తి చేసి ఇటీవల నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షలు రాశాడు. అనంతరం సివిల్స్‌ సాధన కోసం శిక్షణ నిమిత్తం ఈ ఏడాది ఢిల్లీకి వెళ్లాడు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని 4 రోజులు సెలవులు రావటంతో స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఖమ్మంలో తన స్నేహితులతో కలిసి ఆగస్టు 17న నగరంలో ఓ ఫ్లెక్సీని కడుతున్న సమయంలో అనుకోని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగ తగిలి షాక్‌కు గురై ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తాజాగా ప్రకటించిన పోలీసు ఫలితాల్లో ప్రవీణ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. దీంతో తల్లిదండ్రులు కొడుకు భౌతికంగా తమ మధ్యలో లేకపోయినా కొడుకు విజయాన్ని విని గుండెలు పగిలేలా రోధించారు.

మరో ఘటన.. తిరుపతిలో అక్కాతమ్ముడి దారుణహత్య! అసలేం జరిగిందంటే

ఏపీలోని తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్‌, మనీష భార్యాభర్తలు. వీళ్లకు కుమారుడు ప్రక్షయ్‌ (6), కుమార్తె ప్రజ్ఞ (4) సంతానం. సోదరుడితో మనీషకు వివాహేతర సంబంధం ఉందని యువరాజ్‌ ఆమెను నిత్యం అనుమానించసాగాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగడంతో గత ఏడాదిగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు తల్లి మనీష వద్దనే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతికి వచ్చిన యువరాజ్ వివాదానికి ముగింపు చెప్పాలనుకుంటున్నట్లు, తనతో మాట్లాడేందుకు తిరుపతి రావాలని కోరాడు. దీంతో మనీష తన తమ్ముడు హర్షవర్ధన్‌, పిల్లలను తీసుకుని గురువారం (అక్టోబర్‌ 5) తిరుపతికి వెళ్లింది. అక్కడి నుంచి యువరాజ్‌ వారిని కపిల తీర్థం సమీపంలో ఓ ప్రైవేటు హోటల్‌కి తీసుకెళ్లాడు. అదేరోజు రాత్రి హోటల్‌లో మనీష, ఆమె సోదరుడిని హర్షవర్ధన్‌ను పిల్లల ఎదుటే కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పిల్లలతోసహా అలిపిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.