Telangana: పోలీసుల తనిఖీల్లో లైసెన్స్ లేకుండా దొరికిన వ్యక్తి.. అనుమానంతో బ్యాగ్‌ చెక్ చేయగా..

|

Apr 21, 2023 | 9:05 PM

కేటుగాళ్లు తమ అక్రమ దందాను కొనసాగించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. క్రియేటివిటీని ఉపయోగించి పోలీసులకు..

Telangana: పోలీసుల తనిఖీల్లో లైసెన్స్ లేకుండా దొరికిన వ్యక్తి.. అనుమానంతో బ్యాగ్‌ చెక్ చేయగా..
Representative Image
Follow us on

కేటుగాళ్లు తమ అక్రమ దందాను కొనసాగించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. క్రియేటివిటీని ఉపయోగించి పోలీసులకు దొరక్కుండా గంజాయిని యదేచ్చగా అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువ.. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి యాదాద్రిలో జరిగింది.

వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బహుపేట సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై అటుగా వచ్చాడు. అతడి కదలికలపై అనుమానమొచ్చి పోలీసులు ఆపి చూడగా.. లైసెన్స్, ఇతర డాక్యుమెంట్స్ లేవని తేలుతుంది. ఇక అతడి బ్యాగ్ చెక్ చేయగా సుమారు 13 కేజీల గంజాయి బయటపడింది. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి భూపాలపల్లి జిల్లాకు చెందిన నెన్నల మహేష్ కాగా, అతడిపై ఖాకీలు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.