Telangana: అయ్యో.. మేతకు వెళ్లి వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 190 పశువులు..!

|

Sep 29, 2023 | 12:16 PM

మేతకు వెళ్లి గ్రామానికి తిరిగొస్తున్న క్రమంలో 190 పశువులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో గురువారం (సెప్టెంబర్‌ 28) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. తాడ్వాయి మండలంలోని సంతాయిపేట గ్రామానికి చెందిన పశువులను ఇద్దరు వ్యక్తులు మేత కోసమని గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి గ్రామానికి తీసుకెళ్లే క్రమంలో భీమేశ్వరవాగు దాటిస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ఒడ్డుకు చేరలేక మూగ జీవాలన్నీ వరద నీళ్లలో..

Telangana: అయ్యో.. మేతకు వెళ్లి వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 190 పశువులు..!
Cattle Washed Away In Flood
Follow us on

తాడ్వాయి, సెప్టెంబర్‌ 29: మేతకు వెళ్లి గ్రామానికి తిరిగొస్తున్న క్రమంలో 190 పశువులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో గురువారం (సెప్టెంబర్‌ 28) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. తాడ్వాయి మండలంలోని సంతాయిపేట గ్రామానికి చెందిన పశువులను ఇద్దరు వ్యక్తులు మేత కోసమని గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి గ్రామానికి తీసుకెళ్లే క్రమంలో భీమేశ్వరవాగు దాటిస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ఒడ్డుకు చేరలేక మూగ జీవాలన్నీ వరద నీళ్లలో కొట్టుకుపోయాయి. నీళ్లలో కొట్టుకుపోయిన పశువుల్లో 20 పశువులు స్వల్ప గాయాలతో బయటపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా వాగు వద్దకు పరుగుపరుగున వచ్చారు. అప్పటికే నీళ్లలో చాలాదూరం పశువులు కొట్టుకుపోయాయి. గ్రామస్థులంతా కలిసి రాత్రి పది గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 80 పశువులను రక్షించ గలిగారు. నీళ్లలో కొట్టుకుపోయిన మిగతా జీవాల కోసం తాడ్వాయి పోలీసులు, కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. వాగు ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా వరద వచ్చినట్లు తెలుస్తోంది.

చెత్త సీఎం అంటూ ఫేస్‌బుక్‌లో యువకుడి పోస్టు హల్‌చల్‌! కేసు నమోదు

చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం అంటూ ఏలూరు చెందిన ఓ యువకుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ గురించి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఈ పోస్టు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన నాగపురుషోత్తమ్‌ అనే వ్యక్తి పోస్టు చేసినట్లు తెలిసింది. దీంతో వైకాపా నాయకుడు జుజ్జవరపు రమేష్‌ యువకుడిపై ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు యువకుడిపై గురువారం (సెప్టెంబర్‌ 28) కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

న్యాయవ్యవస్థను కించపరిచేలా సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేసిన వ్యక్తి అరెస్టు

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. బాబు అరెస్ట్‌పై వైకాపా నాయకురాలు హిమబిందురెడ్డి తన అభిప్రాయాన్ని తెలుపుతూ వీడియో రూపొందించి పోస్టు చేశారు. ఆమె ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అని, హైకోర్టు, సుప్రీంకోర్టుకు తెలిసేలా సదరు వీడియోను ప్రతి ఒక్కరూ షేర్‌ చేయాలని తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన టీడీపీ కార్యకర్త కె బాలాజీరావు వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేశారు. ఈ వీడియో నెల్లూరుకు చెందిన వి చంద్రశేఖర్‌కు కూడా రావడంతో.. ఆమె జడ్జి కాదని, న్యాయవ్యవస్థను కించపరిచేలా వీడియో పోస్టు చేశాడని, ఆ పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సెప్టెంబర్‌ 26న వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని సెప్టెంబర్‌ 28న అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.