విశాఖ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్..!

|

Jan 04, 2025 | 8:40 AM

శంషాబాద్ విమానాశ్రయంలో ఒక్కసారి అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మళ్లించి ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే గమనించిన పైలెట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మళ్లించి ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. విమానం దిగి బయటకు వచ్చిన వారంతా ఊపిరిపీల్చుకున్నారు. జరగరానిది ఏదైన జరిగి ఉంటే పరిస్థితి ఏంటని వారంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..