Telangana: తాగివచ్చి స్కూల్‌లో నిద్రపోతున్న టీచర్.. అడిగినవారికి తలతిక్క సమాధానాలు

|

Mar 30, 2022 | 10:49 AM

Telangana: తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవోభవ(Acharyadevobhava) అంటూ గౌరవిస్తూ గురువుకి మహోన్నత స్థానం ఇచ్చాము. విద్యార్థులకు లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతూ చక్కటి భవిష్యత్..

Telangana: తాగివచ్చి స్కూల్‌లో నిద్రపోతున్న టీచర్.. అడిగినవారికి తలతిక్క సమాధానాలు
Drinking Teacher
Follow us on

Telangana: తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవోభవ(Acharyadevobhava) అంటూ గౌరవిస్తూ గురువుకి మహోన్నత స్థానం ఇచ్చాము. విద్యార్థులకు లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతూ చక్కటి భవిష్యత్ కు పునాది వేసే అత్యున్నత స్థానం గురువుది. దేశాన్ని ఏలే రాజు కూడా ఒక ఉపాధ్యాయుడికి శిష్యుడే.. సపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో సన్మార్గంలో నడవడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. అందుకనే  భవిష్యత్‌లో ఏ స్థాయిలో ఉన్నా తమకు చదువు చెప్పి తమ భవిష్యత్ కు అందమైన పునాది వేసిన   ఉపాధ్యాయులను గౌరవిస్తూనే ఉన్నాం.. అయితే విద్యార్థులకు విద్యాబుద్ధలను నేర్పాల్సిన ఓ టీచర్ సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు.. చక్కగా చదువు నేర్పాల్సిన స్కూలు టీచర్ తప్పతాగి వచ్చి తరగతి గదిలోనే నిద్ర పోతున్నాడు. ఈ  ఘటన మహబూబ్ నగర్ జిల్లా(Mahabub nagar district)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జడ్చర్ల మండలంలోని చిట్టిబోయిన పల్లిలో. శశికాంత్ అనే ఒక ఉపాధ్యాయుడు..రోజూ తప్ప తాగి విధులకు హాజరవుతున్నాడు. ప్రతిరోజు తమ టీచర్ తీరుని గమనించిన విద్యార్థులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు, స్థానిక యువకులు పాఠశాలకు చేరుకున్నారు. క్లాస్‌ రూమ్‌లనే నిద్రపోతున్న టీచర్‌ శశికాంత్‌ను నిద్రలేపాడు. ఎందుకు తాగి వస్తున్నావ్‌ అంటూ నిలదీయగా, తలతిక్క సమాధానాలు చెబుతూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇతడిపై చర్యలు తీసుకోవాలని. తమ స్కూలుకు కొత్త టీచర్ ను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:
Vitamin E Oil: కళ్ళు చుట్టూ వలయాలు, ముఖంపై టాన్‌ను పోగొట్టడంలో విటమిన్-ఇ ఆయిల్ ఎంత మేలు చేస్తుందో తెలుసా…!